దళితోధ్దారుకుడు బాబు జగ్జీవన్ రామ్
– తాండూరు దళిత సంఘాల నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వాత్రంత్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రాం దళితోధ్దారుడు అని తాండూరు దళిత సంఘాల నాయకులు అభివర్ణించారు. బుధవారం తాండూరు పట్టణం డీఎస్పీ కార్యాలయం ఎదురుగా బాబు జగ్జీవన్ రామ్ వర్దంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దళిత సంఘాల ప్రతినిధులు, అభిమానులు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. దళితోద్దారుడుగా.. నేటి తరానికి ఆయన ప్రాయుడు అని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు.



