ఈద్ ముభార‌క్‌ – ఘనంగా బక్రీద్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఈద్ ముభార‌క్‌..!
– ఘనంగా బక్రీద్
– ఈద్గా, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు
– శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : త్యాగనిరతిని చాటే బక్రీద్ పర్వదినాన్ని తాండూరులో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఈద్-ఉల్-జుహా సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూరు పట్టణ శివారులోని చెన్గేష్ పూర్ రోడ్డు మార్గంతో పాటు ఖాంజాపూర్ గేటు సమీపంలో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులు తరలివచ్చి సామూహిక ప్రార్థనలు చేశారు.
దీంతో ఈద్గా వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా మత ప్రవక్తలు మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకగా బక్రీద్న జరుపుకుంటామని తెలిపారు. ఆ త్యాగాన్ని అందరు మననం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బక్రీద్ పండగ సందర్భంగా చెన్గేష్ ప్పూర్ రోడ్డుమార్గంలోని ఈద్గా వద్ద జరిగిన వేడుకలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్య‌క్షులు ఎం.ర‌మేష్ మ‌హారాజ్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్, ప‌లు పార్టీల నాయ‌కులు హాజ‌రై ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ అధికార ప్ర‌తినిధి రాజుగౌడ్, పట్టణ అధ్యక్షులు అఫ్పూ(న‌యూం), మాజీ అధ్య‌క్షులు అబ్దుల్ రవూఫ్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి, మసూద్, ఇందర్ చెడ్ రాజు, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల‌, ప్ర‌చార క‌మిటి అధ్య‌క్షులు విద్యాసాగ‌ర్ గౌడ్, టీఆర్ఎస్ యువనాయకులు బిడ్కర్ – రఘు, అశోక్, ఇంతియాజ్, మోయిజ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు, ఈద్గాకమిటి చైర్మన్ యూసుఫన్, పలు పార్టీల నాయకులు, పట్టణ ప్రముకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు ఉన్నారు.