జిల్లా ఎస్పీని కలిసిన తాండూరు ఎమ్మెల్యే తండ్రి
– శాంతి భద్రతలకు సహకరిస్తామని హామి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా ఎస్సీ ఎన్.కోటిరెడ్డిని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పి.విఠల్ రెడ్డి కలిశారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ ఐపీఎస్‌గా పదోన్నతి పొంది స్థాన చలనం పొందారు. ఆయన స్థానంలో ఆదివారం జిల్లా నూతన ఎస్పీగా ఎన్.కోటిరెడ్డి(ఐపీఎస్) బాధ్యతలు చేపట్టారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్సీ కోటిరెడ్డితో విఠల్ రెడ్డి కాసేపు ముచ్చటించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తమవంతు సహకారం అందిస్తామని అన్నారు.
