బీసీల రారాజు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీల రారాజు..!
– జాతీయ కార్య‌వ‌ర్గంలో చోటు
– కందుకూరి రాజ్ కుమార్‌కు గౌర‌వం
– స‌న్మానించిన బీసీ సంఘాల నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో బీసీల నాయ‌కుడు అనగానే కందుకూరి రాజ్‌కుమార్ అంద‌రు గుర్తిస్తారు. బీసీల స‌మ‌స్య‌ల పోరాటంలో ఒకే ఒక్క‌డుగా పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదించుకున్న రాజ్ కుమార్‌కు బీసీ సంఘం అరుదైన గౌర‌వం ల‌భిచింది. జాతీయ కార్య‌వ‌ర్గంలో రాజ్ కుమార్ స‌భ్యుడుగా చోటు ద‌క్కించుకున్నారు. బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షులు ఆర్.కృష్ణ‌య్య చేతుల మీదుగా రాజ్ కుమార్ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా నియామ‌క‌ప‌త్రం అందుకున్నారు. తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 15 ఏండ్ల నుంచి బీసీల స‌మ‌స్య‌ల‌పై అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నారు. కుల, చేతి వృత్తిదారుల స‌మ‌స్య‌ల‌తో పాటు విద్యా, వైద్య రంగాల‌లో బీసీల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారు. సామాజిక అంశాల‌ల‌పై నిత్యం ద‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేప‌డుతూ బీసీల స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తుతున్నారు. దీనిని గుర్తించి జాతీయ అధ్య‌క్షులు ఆర్.కృష్ణ‌య్య రాజ్ క‌మార్ కు జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా నియ‌మించారు. ఈ సంద‌ర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూరు నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నుంచి ఏకంగా జాతీయ స్థాయిలో స్థానం క‌ల్పించ‌డం త‌న అదృష్ణ‌మ‌న్నారు. ఆర్.కృష్ణ‌య్య నాయ‌క‌త్వంలో బీసీల అభివృధ్దికి పోరాటం చేస్తామ‌ని పేర్కొన్నారు.

రాజ్ కుమార్‌ను స‌న్మానించిన నాయ‌కులు

జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా రాజ్ కుమార్ నియామ‌కం కావ‌డంతో బీసీ రాష్ట్ర నాయ‌కులు స‌య్య‌ద్ షుకూర్ ఆధ్వ‌ర్యంలో సంఘంతో పాటు పలు కుల సంఘాల ప్రతినిధులు, యువకులు రాజ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, గుండు, చంద్రశేఖర్, మహిళ అధ్యక్షురాలు నాయికోడి జ్యోతి, ప్రధాన కార్యదర్శి రాము ముదిరాజ్, టైలర్ రమేష్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల అధ్యక్షులు లక్ష్మణ్ వాడి, నరేందర్ ముదిరాజ్, బసంత్, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, రాధాకృష్ణ, బస్సు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పరమేశ్వర్, నర్సింహా, నవీన్, నరహరి, మహేందర్, సత్యనారాయణ, రాజు, అనిల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.