బీసీల ఉద్య‌మ నేత‌లు మీరే

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీల ఉద్య‌మ నేత‌లు మీరే
– రాజ్ కుమార్‌ను సన్మానించిన రాష్ట్ర బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రద్ పటేల్
– స‌య్య‌ద్ షుకూర్‌కు అభినంద‌న‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : బీసీల ఉద్య‌మ నేత‌లు మీరే అంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ క‌మీష‌న్ మెంబ‌ర్ శుభ‌ప్ర‌ద్ ప‌టేల్ తాండూరుకు చెందిన బీసీ సంఘం జాతీయ క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్, రాష్ట్ర కార్య‌ద‌ర్శి స‌య్య‌ద్ షుకూర్‌ల‌ను అనందించారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియామకమైన రాజ్ కుమార్‌తో పాటు రాష్ట్ర కార్య‌ద‌ర్శి స‌య్య‌ద్ షుకూర్‌ల‌ను శ‌నివారం బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ స‌న్మానించారు. శాలువా, పూల‌మాల‌తో స‌త్క‌రించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా శుభ‌ప్ర‌ద్ ప‌టేల్ మాట్లాడుతూ బీసీ జాతీయ వర్గంలో రాజ్ కుమార్ నియామకం హర్షణీయమన్నారు. బీసీల త‌రుపున ఉద్య‌మిస్తున్న రాజ్ కుమార్‌ల‌కు ఉన్న‌త‌మైన గౌర‌వం ద‌క్కింద‌న్నారు. రాజ్ కుమార్‌తో పాటు షుకూర్‌లు బీసీల స‌మ‌స్య‌పై అలుపెరుగ‌ని పొరాటం చేయాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాను, బాలు, శ్రీశైలం, విజయ్, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.