రేపు తాండూరులో పవర్ కట్
– ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు
– ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్ అంతరాయం కలిగిస్తున్నట్లు వెల్లడించారు. తాండూరు మున్సిపాలీటి, తాండూరు, యాలాలు, బషీరాబాద్, పెద్దేముల్, కోట్ పల్లి, బంట్వారం, నాగసముందర్ మండలాలు, గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. 220/132/33 కేవీ సబ్ స్టేషన్లలో పీటీఆర్ సిఫ్టింగ్ వర్క్స్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు వినియోగదారులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

