పైలెట్ కి యమక్రేజ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్ కి యమక్రేజ్..!
– తాండూరులో రీ ఎంట్రీ అదుర్స్
– భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు
– అడుగడుగునా జన నీరాజనం
– ‘ గజ’మెత్తిన గులాబీ నేతల అభిమానం
– అభివాదం చేసిన రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై క్రేజ్ తగ్గలేదని గులాబీ నేతలు నిరూపించారు.

చాలా గ్యాప్ తరువాత తాండూరు రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ రెడ్డికి స్థానిక నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సోమవారం తాండూరుకు వచ్చిన పైలెట్ రోహిత్ రెడ్డికి గులాబీ నేతలు, కార్యకర్తలు జన నీరాజనం తెలిపారు.

తాండూరుకు వస్తూ రోహిత్ రెడ్డి అనంత గిరి పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో సన్మానించారు. అక్కడి నుంచి రాజీవ్ కాలని వద్ద రోహిత్ రెడ్డి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

తాండూరు పట్టణంలోని విలియం మూన్ చౌరస్తా వద్ద తాండూరు బీఆర్ఎస్ నాయకులు రోహిత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పైలెట్ చేతికి గదను బహుకరించారు. రోహిత్ రెడ్డి కోసం తరలి వచ్చిన గులాబీ నేతలతో చౌరస్తా సంద్రంగా మారింది. రోహిత్ రెడ్డికి నేతలు, కార్యకర్తలు భారీ గజ మాల వేసి తాండూరుకు గ్రాండ్ వెల్ కమ్ పలికారు. అక్కడి నుంచి నివాసం వరకు నడుచుకుంటూ జేజేలు పలుకుతూ వచ్చారు. నేతలు, కార్యకర్తలు చూపిన అభిమానానికి రోహిత్ రెడ్డి అభివాదం తెలిపారు..

సస్పెండ్ చేసిన నేతకు సన్మానమా..?