దిగివ‌స్తున్న పెట్రోల్, డిజీల్ ధ‌ర‌లు

జాతీయం తెలంగాణ

దిగివ‌స్తున్న పెట్రోల్, డిజీల్ ధ‌ర‌లు
– ప‌లు ప్రాంతాల‌లో ధ‌ర‌ల వ్యత్యాసం
ద‌ర్శిని ప్ర‌తినిధి : దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. దీంతో సోమవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాలతోపాటు గ్రామీణ జిల్లాల్లోనూ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో తేడా ఉంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.62 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.71 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96ఉండగా.. డీజిల్ ధర రూ.93.26గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.80 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.30 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.02గా ఉంది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.60గా ఉండగా.. డీజిల్ ధర రూ. 96.75గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.63గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.03 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.58గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.99గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.63 ఉండగా.. డీజిల్ ధర రూ.97.04గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.69 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.61లకు లభిస్తోంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.41 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.61 లకు లభిస్తోంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.90లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.77గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.22 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.87 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.27గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.22గా ఉంది.