వినాయక ఏజెన్సీ నుంచి ఉత్తవ సేవలు
– ఇంటలిజెన్స్ డీఐజీ పవిత్ర ద్వారా శిక్షణ పత్రం అందుకున్న విఠల్ నాయక్
– మొయినాబాద్ ఐఐటీఏ క్యాంపస్‌లో వారం రోజుల శిక్షణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రైవేటు ఏజెన్సీలలో వినాయక ఔట్ సోర్సింగ్ ద్వారా ఉత్తమ సేవలను అందించాలని ఇంటలిజెన్స్ డీఐజీ పవిత్ర ఏజెన్సి నిర్వహకులు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్‌కు సూచించారు. మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో గత వారం రోజులుగా ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సిలకు శిక్షణ ఇచ్చారు.

ఈ శిక్షణలో వినాయక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ సిబ్బంది కూడ పాల్గొన్నారు. శనివారం ఐఐటీఏ క్యాంపస్‌లో నిర్వహించిన శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ సమావేశానికి ఇంటిలిజెన్స్ డీఐజీ పవిత్ర పాల్గొని ఏజెన్సీలకు శిక్షణ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వినాయక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ తరుపున నిర్వహకులు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ శిక్షణ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. అనంతరం విఠల్ నాయక్ మాట్లాడుతూ డీఐజీ పవిత్ర చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకోవడంపై విఠల్ నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా వినాయక ఔట్ సోర్సింగ్ ద్వారా ఉత్తమ సేవలను అందించాలని డీఐజీ సూచించినట్లు తెలిపారు. డీఐజీ ఆదేశాలతో పాటు ఏజెన్సీ నిబంధనల మేరకు ఏజెన్సీ ద్వారా ఉత్తమ సేవలు, సిబ్బందికి ప్రోత్సహాం అందిస్తామని విఠల్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రైవేటు సెక్యూరిటి ఏజెన్సీ ప్రతినిధులు, నిర్వహకులు పాల్గొన్నారు.

