– గడ్డం ప్రసాద్ నివాసంలో కొండాతో చర్చలు
వికారాబాద్, ఆగస్టు 15 (దర్శిని) : కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్‌తో భేటి అయ్యారు. ఆదివారం టీపీసీసీ రేవంత్‌రెడ్డి వికారాబాద్‌లో గడ్డం ప్రసాద్ నివాసానికి వచ్చారు.
చేవేళ్ల పార్లమెంట్ మాజీ సభ్యులు(మాజీ ఎంపీ) కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై, పార్టీ నాయకుల సహాకారం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అయితే టీపీసీసీ రేవంత్‌రెడ్డి వెంట మాజీ ఎంపీ కొండా హాజరుకావడం ప్రాధాన్యత సంతరించకుంది. తిరిగి మాజీ ఎంపీ కొండా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని నాయకులు చర్చించుకున్నారు.
