– ఆరు నెలల పాటు వైద్య సేవలు
– జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డా. రవీందర్ యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీబీ బాధితులకు ఆరు నెలల పాటు ఉచిత చికిత్స అందించడం జరగుతుందని వ్యాధి నియంత్రణ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్ యాదవ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణం ఇందిరానగర్ హమాలీబస్తీలో ఉన్న అంగన్‌వాడి కేంద్రంలో ఏలీషా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో టీబీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ టీబీ వ్యాధి పట్ల అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్దారణ అయిన బాధితులకు ఆరు నెలల పాటు ఉచితంగా చికిత్స అందిస్తామన్నారు. టీబీ బాధితులు వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మరోవైపు ఏలీషా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో దాదాపు 60 మందికి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బోయ రవి, డాక్టర్ స్పందన. సూపర్‌వైజర్‌లు అరుణ్ కుమార్, అంబికా, ఏఎన్ఎం రేణుక, ఆశ కార్యకర్తలు సంస్థ ప్రోగ్రామ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

