సర్దార్ కృషితో దేశ సమైక్యత

తాండూరు రాజకీయం వికారాబాద్

సర్దార్ కృషితో దేశ సమైక్యత
– తాండూరులో వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– జయంతిలో నివాళులు అర్పించిన నాయకులు, సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వాతంత్య్ర యోధుడు, భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ ఎనలేని కృషితో దేశ సమక్యత సాధ్యమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని మల్లప్ప మడిగ సమీపంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ కన్వినర్ రాజ్ కుమార్తో పాటు నేతలు, అసోసియేషన్ సభ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని దాదాపు 600ల స్వదేశీ సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.
kvcs
ఆయన కృషితోనే దేశ సమక్యత సాధ్యమైందని, దేశ మహనీయుడుగా నిలిచారని అభివర్ణించారు. తాండూరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు 20 ఏండ్ల క్రితమే మున్సిపల్ లో తీర్మానం చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కోటం సిద్ధలింగం, గడ్డం వెంకటేష్, జోసఫ్, రాయల్ రాజ్ కుమార్, టైలర్ రమేష్, నాగారం మల్లేశం, కృష్ణ ముదిరాజ్, రజనీకాంత్, మ హేష్ ఠాకూర్, బంటారం భద్రేశ్వర్, అనిల్ బాండ్, చౌకిదార్ చందు, మంతటి రాజు, యాసర్, పరమేస్, అజయ్, పర్యాద రామకృష్ణ, అనిత, జగదీశ్వరి, వాసు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

బీరప్ప స్వామి వైభోగం..!