బండి తొలగింపు దుర్మార్గం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బండి తొలగింపు దుర్మార్గం..!
– బీసీల పట్ల బీజేపీ చిన్నచూపు
– కిషన్‌రెడ్డిని తొలగించి సంజయ్‌ని కొనసాగించాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీజేపీ తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను దుర్మార్గమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ వర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం పట్ల రాజ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ను తొలగించడం బీజేపీ బీసీల పట్ల చిన్నచూపు చూస్తుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ జాతీయ నాయకత్వాన్నితప్పు పట్టారు. బీసీ నాయకుడు అయినటువంటి బండి సంజయ్ నీ బలవంతంగా రాజీనామా చేయించి అగ్ర కులాలకు చెందిన కిషన్ రెడ్డికి తెలంగాణ బిజెపి పార్టీ పగ్గాలు అప్పగించడం పై తీవ్రంగా విమర్శించారు. గత కొంతకాలంగా బిజెపి బలోపేతం కోసం కృషిచేసిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుని తొలగించడం బీసీలను విస్మరించడమే అని అన్నారు. కేంద్రమంత్రి పదవి, ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డిని తొలగించాలని అన్నారు. బండి సంజయ్ నాయకత్వాన్ని కొనసాగించాలని, లేదా బడుగు వర్గాలకు చెందిన నాయకులు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బాబురావు నియమించాలని అన్నారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage