ఇక ఆర్టీసీలో క్యూఆర్ కోడ్..!

టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

ఇక ఆర్టీసీలో క్యూఆర్ కోడ్..!
– స్కాన్ చేసి టిక్కెట్టు పొందే సదుపాయం
– చిల్లర సమస్యకు చెక్‌ పెట్టనున్న ఆర్టీసీ
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: సాంకేతిక అంశాలను అందిపుచ్చుకుంటున్న ఆర్టీసీ సంస్థ మరో నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులో నగదు రహిత సేవల కోసం క్యూఆర్ కోడ్‌ వ్యవస్థను తీసుకరావాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థ ద్వారా గత కొన్నేళ్లుగా ప్రయాణికులకు, కండక్టర్ల మద్య ఎదురవుతున్న చిల్లర సమస్యకు చెక్‌ పెట్టెందుకు దృష్టిసారిచింది. ఈ విధానం అందుబాటులోకి కండక్టర్‌కు డబ్బు చెల్లించకుండా బస్సులోని ప్రయాణికులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నేరుగా చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించింది ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం కసరత్తు పూర్తి చేసింది. నగదు రహిత టికెట్‌ కొనుగోలు పద్ధతిని ప్రవేశపెట్టాలని గత ఏడాది చివరలోనే టీఎస్‌ఆర్టీసీ భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల అది అమలుకు నోచుకోలేదు.

ఐతే ఏదైనా కారణం వల్ల డబ్బులు జమకాకపోతే ఆ డబ్బులకు ఎవరు బాధ్యత వహించాలి, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా జమ అయిన నగదు ఎవరి ఖాతాలో జమ చేయబడతాయి భావించారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన తర్వాత ప్రయోగాత్మకంగా తొలుత సిటీ బస్సుల్లో అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత టికెట్లు చలామణిలోకి రానున్నాయి. ముందుగా సీటీ బస్సుల్లో అమలు చేసి.. దాని సేవలను అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని భావిస్తోంది.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage