మంత్రి మహేందర్ రెడ్డి క్యాడెర్‌లో జోష్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మంత్రి మహేందర్ రెడ్డి క్యాడెర్‌లో జోష్..!
– వర్గీయులకు వర్కింగ్‌ ప్రెసిడెంట్ పదవులు
– నియమించినట్లు ప్రకటించిన ఎమ్మెల్యే వర్గం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు నియోజకవర్గం మంత్రి మహేందర్ రెడ్డి క్యాడర్‌లో జోష్‌ నిండింది. మహేందర్ రెడ్డి వర్గీయులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు వరించాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గీయులు ప్రకటించడం విశేషం. గత కొన్ని రోజుల క్రితం మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిల మద్య వర్గపోరు కొనసాగిన సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాండూరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విషయంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల మద్య ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాల పదవుల విషయంలో కూడా ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యే వర్గం నేతలు పలు పదవుల్లో ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్యే మద్య జరిగిన ఒప్పందంలో భాగంగా మంత్రి మహేందర్ రెడ్డి వర్గీయులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ పదవులను కట్టబెట్టారు. తాండూరు నియోజకవర్గంలో పట్టణం, మండలాల వారీగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నట్లు పైలెట్ రోహిత్ రెడ్డి గారు ప్రకటించారు.

పెద్దెముల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సీనియర్ నాయకులు డీవై నర్సింహులు, యాలాల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ మండల అధ్యక్షలు పీ. మల్లారెడ్డి, తాండూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ మార్కెట్ కమిటీ చైర్మైన్ వడ్డే శ్రీనివాస్, తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సిహులు, బషీరాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సీనియర్ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షలు పట్లోళ్ల శంకర్ రెడ్డి గార్లను నియమించారు.

ఇదికూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!