హస్తం అభ్యర్థులు సిద్దం..!

జాతీయం తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

హస్తం అభ్యర్థులు సిద్దం..!
– ఫస్ట్ లిస్టులో ఎవరెవరు ఉండొచ్చంటే..?
– ఢిల్లీ నుంచి ఎంపిక ప్రక్రియ
– 35 స్థానాలను ఖరారు చేయనున్న స్ర్కీనింగ్ కమిటి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: హస్తంలో అభ్యర్థుల వడబోత కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ జాబితాను ఢిల్లీకి పంపించినట్లు సమాచారం. ఈ నెలాఖరుకల్లా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం హస్తినలో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. ఏకాభిప్రాయం కుదిరితే 25 నుంచి 30 సీట్లలో అభ్యర్థుల ఖరారు చేయాలనే ఆలోచనలో ఉంది పార్టీ.. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు అభ్యర్థులున్న చోట మరోసారి స్క్రీనింగ్ కమిటీ దృష్టి పెట్టాలని భావిస్తోంది. మొత్తంగా 119 స్థానాలకు.. 35 స్థానాల్లో అభ్యర్థుల లిస్టు క్లియర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

దాదాపుగా ఖరారు అయిన అభ్యర్థుల జాబితా

1. కొడంగల్ – రేవంత్ రెడ్డి
2. హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
3. కోదాడ – పద్మావతి
4. మధిర – భట్టి విక్రమార్క
5. మంథని – శ్రీధర్ బాబు

6. జగిత్యాల – జీవన్ రెడ్డి
7. ములుగు – సీతక్క
8. భద్రాచలం – పొడెం వీరయ్య
9. సంగారెడ్డి – జగ్గారెడ్డి
10. నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
11. అలంపూర్ – సంపత్ కుమార్
12. నాగార్జునసాగర్ – కుందూరు జైవీర్ రెడ్డి
14. కామారెడ్డి – షబ్బీర్ అలీ
15. మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు
16. ఆందోల్ – దామోదర రాజనర్సింహ
17. పరిగి – రామ్మోహన్ రెడ్డి
18. వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
19. ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
20. ఆలేరు – బీర్ల ఐలయ్య
21. బాల్కొండ – సునీల్ రెడ్డి
22. ఖమ్మం- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
23. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
24. పెద్దపల్లి- విజయ రమణరావు
25. చొప్పదండి- మేడిపల్లి సత్యం
26. నిర్మల్ – శ్రీ హరి రావు

27. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
28. బెల్లంపల్లి- గడ్డం వినోద్
29. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
30. వేములవాడ- అది శ్రీనివాస్
31. నర్సాపూర్- ఆవుల రాజీ రెడ్డి
32. జహీరాబాద్ – A చంద్రశేఖర్
33. ఆసిఫాబాద్ – రేఖ నాయక్/శ్యామ్ నాయక్
34. ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
35. మహేశ్వరం- చిగురింత పారిజాత నర్సింహారెడ్డి

14 మంది మట్కారాయూళ్లపై కేసు