కేసీఆర్‌ ఛాతికి ఇన్‌ఫెక్షన్‌ అటాక్‌..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

కేసీఆర్‌ ఛాతికి ఇన్‌ఫెక్షన్‌ అటాక్‌..!
– ప్రగతి భవన్‌లో వైద్య సేవలు
– ఆప్‌డేట్ ఇచ్చిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి కేటీఆర్ అప్‌ డేట్ ఇచ్చారు. వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వైద్యులు ఆయనకు ప్రగతి భవన్‌లో చికిత్స అందిస్తున్నారు.

సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారని, ప్రగతి భవన్‌లో ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సెప్టెంబర్ 26న కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని, మంత్రి కేటీఆర్ తెలిపారు. వైరల్‌ ఫీవర్‌తో పాటు కేసీఆర్‌కు ఛాతీలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని తెలిపారు.

ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. ఓ జాతీయ టీవీ ఛానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ కేటీఆర్ ఈ విషయం వెల్లడించారు. కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని డాక్టర్ల బృందం చెప్పినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలిసి బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడ చదవండి..

14 మంది మట్కారాయూళ్లపై కేసు