ఉగ్రదాడిపై భగ్గుమన్న తాండూరు
– నిరసన ర్యాలీలో దండెత్తిన జనం
– వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన పురవీధులు
-పార్టీలకతీతంగా పాల్గొన్న నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జమ్ము కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై తాండూరు ప్రజలు భగ్గుమన్నారు. ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ హిందూ ఐక్య వేధిక ఆధ్వర్యంలో తాండూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని నెహ్రు గంజ్ ఎల్లమ్మ దేవాలయం నుంచి ర్యాలీ ప్రారంభమయ్యింది.

ఈ ర్యాలీలో పార్టీలకతీతంగా రాజకీయ, హిందూ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి.. కాశాయ జెండాలు, కండువాలతో ముందుకు సాగారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్లు స్వప్న పరిమళ్, కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, సునీతాసంపత్, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, అంతారం లలిత, సాహు శ్రీలత, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పట్టణ అద్యక్షులు నాగారం మల్లేశం, హిందూ సంఘాల ప్రతినిధులు పట్లోళ్ల నర్సింలు, రజనీకాంత్, లింగదలి రవికుమార్, యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉగ్రదాడి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై శ్రీరాం, జైభారత్ నినాదాలతో పురవీధులను మార్మోగించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత్ పర్యాటకులపై ఉగ్రదాడి దారుణమన్నారు. ఈ దాడిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.
ఇది కూడా చదవండి….

