పట్నం సునీతమ్మకు జేజేలు..!
– తాండూరులో ఘనంగా సునీతమ్మ జన్మదినం
– రోగులకు అల్పహారం పంపిణీ చేసిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డికి తాండూరు నేతలు జేజేలు పలికారు. సోమవారం సునీతా మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. యువనాయకులు బిర్కడ్ రఘు ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు అల్పహారం పంపీణి చేశారు. అదేవిధంగా పట్టణంలోని చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి నివాసంలో కేక్ కట్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్లు గడ్డలి పరిమళ రవీందర్, అబ్దుల్ ఖవి, నాయకులు గడ్డలి రవీందర్, పలువురు నాయకులు ఉత్సహాంగా కేక్ కట్ చేసి సునీతా మహేందర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు చేశారు. అనంతరం వారు సునీతా మహేందర్ రెడ్డి ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకొ వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీదర్ రాజశేఖర్, ముస్తఫా, శివానంద్, భగవాన్, నేతలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

