మోడి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
– ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలి
-కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: అన్ని వర్గాలను మోసం చేస్తున్న మోడీ సర్కారుకు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని ఎంఎస్ఎఫ్ వికారాబాద్ జిల్లా కన్విసర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష బుధవారం రెండోరోజు కొనసాగింది. ఈ నిరసన దీక్షకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన ఇచ్చిన హామిని నిలబెట్టుకోలేదన్నారు. 8 ఏండ్లు అయినా ఎస్సీ వర్గీకరణ చేయపట్టని మోడి ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ తరుపున ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ ఎస్సీ సెల్ నాయకులు నవీన్, కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షులు జావిద్ ఖాన్, నవాజ్ ఖాన్, ఎన్ ఎస్ యూఐ నాయకులు ప్రణీత్, ఎంఎస్పీ బషీరాబాద్ ఇంచార్జ్ బి.కృష్ణ మాదిగ, నాయకులు మహేందర్, ముణ్యప్ప, ప్రవీణ్, శ్రీశైలం, నవీన్, అజయ్, మోహన్, గణేష్, గోపాల్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.



