గెలుపు ఆశీర్వాదం ఇవ్వండి
– ప్రచారంలో ఆకట్టుకున్న ఆర్తి రెడ్డి
– పట్టణంలో జోరుగా ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి గెలుపు ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన సతీమణి ఆర్తి రెడ్డి కోరారు. ఆదివారం బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలోని 6వ వార్డు, 22వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి పాల్గొని రోహిత్ రెడ్డి తరుపున ప్రచారం చేశారు. ఆయా వార్డులలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ కరపత్రాలను పంచారు. ప్రచారంలో ఆర్తి రెడ్డి ముసలవ్వల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సర్కారు పథకాలను అందరికి అమలు చేస్తూ ఆదుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి గెలుపు ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

