రైతు సమితి కోఆర్డీనేటర్‌గా పాండురంగారెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతు సమితి కోఆర్డీనేటర్‌గా పాండురంగారెడ్డి
– బషీరాబాద్‌ మండల సమన్వయకర్తగా నియామకం
– ఉత్తర్యలు జారీ చేసిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్
– వెంటనే అమల్లోకి ఉత్తర్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరుడుగా ఉన్న బషీరాబాద్‌ మండల నాయకుడు పాండు రంగారెడ్డికి నామినేటేడ్‌ పోస్టు వరించింది. రైతు సమన్వయ సమితి కోఆర్డీనేటర్‌(సమన్వయకర్త)గా నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవదారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసింది. బషీరాబాద్‌ మండలం పర్వత్‌ పల్లి గ్రామానికి చెందిన పాండురంగారెడ్డి మండలంలో సీనీయర్ యువనాయకుడుగా కొనసాగుతున్నారు. మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. తాజాగా ఆయనను నామినేటేడ్ పోస్టు కింద రైతు సమన్వయ సమితి బషీరాబాద్‌ మండల కోఆర్డీనేటర్‌గా నియమించారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. అతనితో పాటు రైతు సమన్వయ సమితి సభ్యులుగా మరో 23 మందికి అవకాశం కల్పించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మరోవైపు గ్రామీణ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నేత పాండు రంగారెడ్డికి నామినేటేడ్ పోస్టు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ శుభకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి…
జోష్‌ పెంచిన మహేంద్రుడు..!
– తాండూరు అసెంబ్లీ పోరుపై క్లారీటి
– నిలిచేది నేనే గెలిచేది నేనే అంటూ ధీమా
– గుర్తు మారోచ్చిన నేతలకు గుణపాఠమే
https://dharshininews.com/17336
chaithany collage