ప్రజా పాలనకు సమాయత్తం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజా పాలనకు సమాయత్తం..!
– రేపు తాండూరులో సమీక్షా సమావేశం
– హాజరు కానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ప్రకటించిన తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమంకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుందని తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు అన్నారు. సర్కారు పథకాన్ని విజయంవంతం చేసేందుకు రేపు తాండూరులో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హజరవుతార చెప్పారు. ప్రభుత్వం అమలు చేయబోయే ఆరు గ్యారెంటీ పథకాలను అర్హులకు ఎలా అందించాలనే అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. కావున సమావేశానికి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు, ఇతర శాఖల అధికారులు తప్పక హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం