తెల్లవారుజామున పోలీసుల జల్లెడ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తెల్లవారుజామున పోలీసుల జల్లెడ..!
– తాండూరు మాణిక్ నగర్‌లో కార్డెన్ సెర్చ్
– 68 వాహనాలు.. 54 మద్యం బాటిళ్లు.. గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్ లో పోలీసులు ఇంటింటినీ జల్లెడ పట్టారు.

శనివారం తెల్లవారుజామున మాణిక్ నగర్ కాలనీలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకే పోలీసు బృందాలు రంగంలోకి దిగి కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేహ్రా ఆదేశాల మేరకు తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో రౌడీషీటర్లు, అనుమానితులు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తుల వివరాలను పోలీసులు పరిశీలించారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 68 వాహనాలను పోలీసులు గుర్తించారు. వీటిలో 65 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు ఉన్నట్లు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు.

అదేవిధంగాతనిఖీల్లో 54 మద్యం బాటిళ్లతో పాటు గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ.. పట్టణంలో అసాంఘిక, అక్రమ కార్యకలాపాలకు తావులేకుండా పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని స్పష్టం చేశారు.

శాంతిభద్రతలకు అందరూ సహకరించాలని సూచించారు. తనిఖీల్లో పట్టుబడిన వాహనాలకు సరైన ధ్రువపత్రాలు ఉన్న వాహనదారులు సంబంధిత పత్రాలను పోలీసులకు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. ఈ తనిఖీలో పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పట్టణ, మండలాల ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

క్వాలిటీ లెస్‌గా సీసీ రోడ్డు..!