డేంజరేస్‌ సీన్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

డేంజరేస్‌ సీన్..!
– రెండు స్కూటీలను ఢీకొట్టిన లారీ
– కారును కూడ.. ఓ ఇంటి ప్రహారి గోడ ద్వంసం
– తాండూరులో బీభత్సకరమైన సంఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఓ లారీ డేంజరేస్ సీన్‌ను చూపించింది. అతివేగంలో అదుపుతప్పి రెండు స్కూటీలను ఢీకొట్టడంతో పాటు మరో కారును, ముందున్న ఇంటి ప్రహారి గోడను సైతం ద్వంసం చేసింది. ఈ బీభత్సకరమైన సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం మేరకు.. AP22V4765 అనే లారీ సిమెంట్ లోడుతో తాండూరు నుంచి మహబూబ్‌ నగర్‌ వెళుతుంది. పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి దాటగానే అతివేగంలో ఉన్న లారీ అదుపు తప్పింది. ఈ క్రమంలో ఓ ఆగి ఉన్న రెండు ద్విచక్ర వాహనాపైకి దూసుకెళ్లింది. అక్కడితో ఆగకుండా ఒక కారు ఢీకొని సమీపంలో ఉన్న దుకాణ నిర్మాణ ప్రహరీ గోడకు ఢీ కొట్టింది. లారీ ఢీకొన్న ఘటనలో ఓ స్కూటీ పూర్తిగా నుజ్జునుజ్జు కాగా కారులో కూర్చున్న ఓప్రయానికుని కి తీవ్ర గాయాలైనట్లుగా తెలిసింది. ప్రయాణికునికి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇదికూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం