ఇదేం విచిత్రం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఇదేం విచిత్రం..!
– తాండూరులో కోడంగల్‌ జనరల్‌ ఆసుపత్రి
– జిల్లా ఆసుపత్రి బోర్డు స్థానంలో ఏర్పాటు
– అయోమయానికి గురైన నాయకులు, ప్రజలు
– ఇలా ఎందుకు జరిగిందంటే…?
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇదేం విచిత్రం అన్నా.. తాండూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిగా కోడంగల్‌ జనరల్‌ ఆసుపత్రిగా మారిపోయిందేంటి.. అని పలువురు అయోమయానికి గురయ్యారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి – కోడంగల్‌ అనే పేరుతో బోర్డు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జిల్లా ఆస్పత్రిగా మార్చడంపై సర్వత్ర విమర్శలకు దారీ తీసింది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి ఇది నిదర్శనం అని విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతకు ఇది ఇలా ఎందుకు పెట్టారు అనేది ఎవరికి అర్థం కాలేదు.

కొద్ది సేపటికే జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోడంగల్ జనరల్‌ ఆసుపత్రి బోర్డు ఫోటోలు సామాజిక మాద్యమాలలో వైరల్‌గా మారాయి. ఈ సంఘటనపై జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. శెట్టి రవిశంకర్‌ను వివరణ కోరగా.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. సీఎం సొంత నియోజకవర్గం కోడంగల్‌ లో ఏర్పాటు చేయాల్సిన బోర్డును పొరపాటున ఇక్కడ ఏర్పాటు చేశారని బదులిచ్చారు. మరోవైపు కొద్ది సేపటి తరువాత జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బోర్డును తొలగించారు.

ఇదికూడా చదవండి…

ప్రయాగలో శంకరన్న పుణ్య స్నానాలు