మహాలక్ష్మీ నమోస్తుతే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మహాలక్ష్మీ నమోస్తుతే..!
– వాసవీమాతకు ప్రత్యేక అలంకరణ
– నోట్లు, రూపాయిలతో దర్శనమిచ్చిన అమ్మవారు
– నగరేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రి శోభ
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహాలక్ష్మీ నమోస్తుతే.. అంటూ వాసవిమాతను తాండూరు ఆర్యవైశ్యులు, మహిళలు కొలిచారు. పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో వాసవీ మహిళ సంఘం, ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం ఆధ్వరయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఐదో రోజు దేవాలయంలో వెలసిన ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకాపరమేశ్వరి మాతను మహాలక్ష్మీ దేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. రూపాయి నాణేలు, 10, 20, 50, 100 నోట్లతోపాటు బంగారు ఆభరణాలతో అమ్మవారిని సంపూర్ణ మహాలక్ష్మీ దేవీగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మహిళా సంఘం సభ్యులు పలు ప్రదర్శనలు ప్రదర్శించారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయాలను ప్రదర్శిస్తూ వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో మహిళలు చేస్తున్న ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
kvcs
ఈ కార్యక్రమంలో వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి, ప్రధాన కార్యదర్శి మంకాల స్వప్న రాఘవేందర్, ఉప కార్యదర్శి తాళ్లపల్లి కవిత, కోశాధికారి సింగంశెట్టి శోభ, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, వాసవీ మహిళ సంఘం సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బీసీ రిజర్వేషన్లు ఖరారు..!