పెరిగిన గ్రూప్-1 పోస్టులు..!
– కొన్ని పోస్టులకు ఇంటర్వూలు లేవ్
– ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గ్రూఫ్-1 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ (TSPSC)కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా గ్రూప్-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. పోస్టుల వివరాలకు కింది వరకు చూడండి..

ఇదికూడా చదవండి…

