కారు భీభత్సం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
కారు భీభత్సం..!

– నాలాలోకి దూసుకెళ్లిన ఇన్నోవా
– అందులోనే నలుగురు యువకులు
– ఒకరి పరిస్థితి విషమం, హైదారాబాద్‌ రిఫర్
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: అతివేగంలో ఓ కారు భీభత్సాన్ని సృష్టించింది. అదుపుతన్ని రోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన నాలాలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో నలుగురు ఉండగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన తాండూరు మున్సిపల్‌ పరిధిలో కలకలం రేపింది. బుధవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో కోడంగల్‌ రోడ్డు మార్గం నుంచి వచ్చిన ఇన్నోవా కారు లక్ష్మీథీయేటర్ సమీపంలోకి రాగానే అతివేగంలో ఉన్న కారు అదుపుతప్పి బొల్తా కొట్టింది.

అదే వేగంలో కారు రోడ్డు పక్కనే నిర్మాస్తున్న భారీ నాలాలోకి దూసుకెళ్లింది. అప్పటికే కారులో తాండూరు పట్టణం దుబాయ్ రెడీమేడ్ షాపుకు చెందిన సర్దార్, సల్మాన్, జుబేర్, హైమద్‌లుగా గుర్తించారు. జేసీబీ యంత్రంతో కారును బయటకు తీశారు. గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదికూడా చదవండి…

‘నీట్‌’గా గురిపెట్టింది…!