కోర్టుకు ఉద్యమ కారులు..!
– పాత కేసులో విచారణకు హాజరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు కోర్టుకు హాజయ్యారు. పాత కేసులో విచారణ నిమిత్తం న్యాయస్థానం ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్(టీఆర్ఎస్‌గా ఉన్నప్పుడు) పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు, స్వర్గీయ ఆయూబ్ ఖాన్ 2018లో క్రితం ఆత్మాహుతికి పాల్పడ్డారు. అప్పటి తోటి ఉద్యమకారులు గాజీపూర్ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి, తెలంగాణ విద్యార్ధి జేఏసీ చైర్మన్ భాను, ఫెరోజ్ ఖాన్‌లు అయూబ్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలని పట్టణంలోని లారీ పార్కింగ్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాతో ప్రభుత్వం అయూబ్ ఖాన్ కుటుంబానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందజేసింది. అప్పటి దర్నాలో పాల్గొన్న వెంకటేష్ చారి, భాను, ఫెరోజ్ ఖాన్‌లపై కేసు నమోదు అయ్యింది. గత ఐదేండ్లుగా కేసు విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం వారు తాండూరులోని జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానంలో వారు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉద్యమ కారులు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరలుగా మాకు మద్దతుగా ఉద్యమ కారుల తరపున వాదిస్తున్న న్యాయవాది గోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తోటి ఉద్యమ కారుడి కోసం ఎన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగినా బాధ కలగటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ తాండూరు నియోజక వర్గ ఇంచార్జి జిలాని ఉన్నారు.
ఇది కూడా చదవండి…


