మృతురాలి కుటుంబానికి సాయం
– ఆర్బీఓల్ శ్రీనివాస్ రెడ్డి ద్వారా అందజేత
యాలాల, దర్శిని ప్రతినిధి : మృతురాలి కుటుంబానికి తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఆర్థిక సాయం అందించారు. యాలాల్ మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన ఈడిగి లక్ష్మీ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేనందున బెన్నురు గ్రామానికి సంబందించిన తన అనుచరులతో మృతురాలి కుటుంబానికి రూ. 5 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

