ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తాండూరు పట్టణం గ్రీన్‌ సీటీ కాలనీకి చెందిన వినోద్ కుమార్(35) కిరణా షాపుతో పాటు పాలిషింగ్ యూనిట్లు నడిపిస్తున్నాడు. సోమవారం సాయంత్రం లక్ష్మీనారాయణ పూర్ రోడ్డు మార్గం నుంచి తాండూరు పట్టణం వైపు వస్తున్నాడు.

ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలోకి రాగానే అదే సమయంలో తాండూరు నుంచి దౌల్తాబాద్‌ వైపు వెళుతున్న ఆర్టీసీ ఢీ బస్సును ఢీ కొట్టాడు. వినోద్ కుమార్ తలకు తీవ్రగాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వినోద్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంభీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

ప్రజా సమస్యలపై ఫోకస్..!