రేపు తాండూరుకు మంత్రి సబితారెడ్డి రాక
– పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి రేపు తాండూరుకు విచ్చేస్తున్నారు. శనివారం నియోజకవర్గంలోని పెద్దేముల్, తాండూరు పట్టణంలో జరిగే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలె ట్ రోహిత్‌రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితామహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌తో పాటు హాజరై పెద్దెముల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన, తాండూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన డిగ్రీ కళాశాల, మాతాశిశు ఆస్పత్రిలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. అదేవిధంగా తాండూరు పట్టణం సాయిపూర్ లో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడి భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం పట్టణంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, అధికారులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరుకావాలని నాయకులు కోరారు.


