రైతు దర్నాకు భారీగా తరలిరండి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రేపు శుక్రవారం చేపడుతున్న రైతు మహాదర్నాకు నేతలు, రైతులు భారీగా తరలిరావాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విధానానని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతు దర్నాకు పిలుపునివ్వడం జరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ దర్నాకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి దర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
