క్యాబేజీతో లాభాలు..!
– శక్తిని పెంచె గుణాలు మెండు
– వారానికి ఒకసారైన తినాల్సిందే
దర్శిని డెస్క్ : కూరగాయాల్లో క్యాబేజీ గురించి అందరికి తెలిసిందే. ఈ క్యాబేజీలో మన ఆరోగ్యానికి కావాల్సిన లాభాలెన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. క్యాబేజీలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మనకు రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. ఇందులో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. క్యాబేజీలో రోగనిరోధక శక్తి పెంచే గుణంతో పాటు షుగర్, థైరాయిడ్ సమస్యలను సైతం క్యాబేజీ సమర్థంగా ఎదుర్కొంటుందని అంటున్నారు. అంతేకాదు క్యాబేజీలో ఫైబర్, విటమిన్ కే, సీ కూడా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రాణాంతక గుండె, క్యాన్సర్ సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది.
గుండె ఆరోగ్యం: క్యాబేజీలో ఆంథోసైనిన్స్ ఉంటాయి. ఆర్థ్రరైటీస్ సమస్యలకు చెక్ పెడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు బీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యలకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా క్యాబేజీ మహిళలకు వరం కంటే తక్కువ కాదు అని ఎన్ ఐ హెచ్ నివేదిక తెలిపింది

మధుమేహం: క్యాబేజీలో యాంటీహైపర్‌గ్లైసెమిక్ గుణం కలిగి ఉంటుంది. ఇది మధుమేహం బాధితులకు మంచిది. డయాబెటిస్ నెఫ్రోపతి నుంచి కాపాడుతుంది. ఇది రక్తంలో చక్కెరస్థాయిలను నిర్వహిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్థులు తప్పనిసరిగా వారి డైట్లో క్యాబేజీని చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ: ఫైబర్ పుష్కలంగా ఉండే క్యాబేజీ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.ఇది కడుపు అల్సర్ రాకుండా చేస్తుంది. క్యాబేజీని డైట్లో చేర్చుకోవడం వల్ల మన శరీర పనితీరు కూడా మెరుగవుతుంది. ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా మీ దరిచేరదు.శరీరంలో మంట వాపు సమస్యలకు కూడా క్యాబేజీ చెక్ పెడుతుంది. దీంతో కేన్సర్, గుండె సమస్యలు, డయాబెటీస్, అల్జీమర్స్‌తో బాధపడేవారికి ఎంతో ఆరోగ్యం.
కేన్సర్: క్యాబేజీలో గ్లూకోసైనోలేట్స్, సల్ఫర్ ఉంటుంది. అంతేకాదు క్యాబేజీలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కేన్సర్ ను నివారిస్తుంది అని వెబ్ ఎండీ తెలిపింది. క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది. క్యాబేజీ అన్ని సీజన్లలో మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది.
ఇదికూడ చదవండి…

