మురిపించిన చిన్నికృష్ణులు
– చెంగోల్లో శ్రీకృష్ణాష్ఠమి వేడుకలు
– ఆకట్టుకున్న బాల గోపాలం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చెంగోల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారి శ్రీకృష్ణులు మురిపించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం పాఠశాలలో వేడుకలు సంబరంగా జరుపుకున్నారు. విద్యార్థులు శ్రీకృష్ణుని వేషాధారణ, విద్యార్థినిలు గొల్లభామల వేషాధారణలో మైమరిపించారు. చిన్ని శ్రీకృష్ణ, రాధా గొల్లబామల సందడి ఆకట్టుకుంది. జన్మాష్టమి సందర్భంగా పాఠశాల ప్రాంగణం బృందావనంను తలపించింది. పాఠశాలలో ఉట్టి కొట్టడం, గొల్ల బామలతో శ్రీకృష్ణుని ఆట పాటలు ఆధ్యంతం అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

