ఎమ్మెల్యేది అభివృద్ధి గేర్..!

తాండూరు లైఫ్-స్టైల్ వికారాబాద్

ఎమ్మెల్యేది అభివృద్ధి గేర్..!
– తాండూరు రోడ్ల ప్రగతికి ప్రత్యేక దృష్టి
– రూ.227.8 కోట్లు మంజూరు హర్షణీయం
– తాండూరు మండల రోడ్లకు పెద్దపీట
– గత పాలకుల అభివృద్ధి అంతా బోగస్
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెన్నంటి సహకరిద్దాం
– డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవీంద్ గౌడ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రగతి గేర్ వేస్తూ దూసుకపోతున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని తన నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఒకే విడతలో నియోజకవర్గలోని అన్ని మండలాల రోడ్లకు రూ. 227 కోట్లు మంజూరు చేయడించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాండూరు మండల రోడ్లకు దాదాపు రూ.117 కోట్లు కేటాయించి పెద్ద పీట వేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బషీరాబాద్- కరణ్ కోట్ రోడ్డు(12 కిలోమీటర్లు)కు రూ.30 కోట్లు, మహబూబ్ నగర్ చించొలి మార్గంలో ని ఫోర్ వే లైన్(4 కిలోమీటర్లు)కు రూ.35 కోట్లు, తాండూరు – వికారాబాద్ రోడ్డు (39 కిలో మీటర్లు)కు రూ.101 కోట్లు మంజూరు చేయడం సంతో షకరమన్నారు.

దీంతో పాటు తాండూరు మండలంలోని గౌతాపూర్ నుంచి చెన్ గెష్ పూర్, బెల్కటూర్ నుంచి వీరారెడ్డిపల్లి, చిట్టిగణాపూర్ నుంచి చంద్రవంచ, ఓగిపూర్ నుంచి కర్ణాటక సరిహద్దు చత్రశాల, కోటబాస్పల్లి నుంచి మల్కాపూర్, జినుగుర్తి నుంచి సంకిరెడ్డిపల్లి, సిరిగిరిపేట్ నుంచి సంకిరెడ్డిపల్లి, గౌతాపూర్ నుంచి గోపన్ పల్లి, తాండూరు నుంచి నారాయణ పూర్, మిట్టబాస్పల్లి నుంచి బెల్కటూర్, సిరిగిపేట్ నుంచి అల్లాపూర్, కరణ్ కోట్ నుంచి జీవని గ్రామాల లింకు రోడ్లకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయన్నారు. అదేవిధంగా తాండూరు, యాలాల, బషీరాబాద్ మండాలలో బ్రహ్మండమైన అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపిస్తున్నారని అన్నారు. మంజూరైన పనులన్నీటిని త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే విధంగా ఎమ్మెల్యే కృషి చె స్తున్నారని అన్నారు. గతంలో పెండింగ్ లో ఉన్న రింగు పనులను కూడా పూర్తి చేయిస్తారని దీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. గ్రామానికి రూ. 50 లక్షలు ఇస్తామని చెప్పి, ఏమి చేయలేదన్నారు. దొంగ ప్రకటనలతో బోగస్ పాలన చేశారని విమర్శించారు. తాండూరు అభివృద్ధికి స్పీడ్ గేర్ వేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి అందరు సంపూర్ణ సహాకారం అందించడం జరుగుతుందన్నారు.

గౌడ్ల సంక్షేమంలో రాద్దాంతం
మరోవైపు తాండూరులోని గౌడ్ల సంక్షేమం విషయంలో కొందరు రాద్దాంతపు విమర్శలు చేశారని రవీందర్ గౌడ్ ఖండించారు. గౌడ సోదరులకు యేడాదికి రెండు సార్లు ఆర్థిక సాయం, ఎవరైనా గౌడ్లు మరణిస్తే రూ. 5వేల ఆర్థిక సాయం అందించాలనే మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారే తప్పా ఇందులో ఎలాంటి స్వార్థం లేదన్నారు. ఈ విషయం తెలియని కొందరు రాద్దాంతపు విమర్శలు చేయడం అవివేకమన్నారు. మంచి పనికి సాయం అందించాలే తప్పా విమర్శించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ సర్పంచులు శ్రీశైలం గౌడ్, బుడ్డెళ్లి సాయిలు, నాయకులు మల్కాపూర్ గనికార్మిక సహాకార సంఘం చైర్మన్ ఎస్. పండరి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, మార్కెట్ కమిటి డైరెక్టర్ జర్నప్ప, నర్సిరెడ్డి, ఉప్పరి నర్సింలు, తుపాకుల అనిల్, నారాయణ రెడ్డి, వడ్ల మల్లేశం, ఖాంజాపూర్ రాంరెడ్డి, బోయిని నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

జామా.. ఆరోగ్యానికి ధీమా..!