హైటెన్షన్.. భూ వివాదం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హైటెన్షన్.. భూ వివాదం..!
– తాండూరులో ఉత్కంఠతకు గురి
– డీఎస్పీ కార్యాలయం వరకు పంచాయతీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఓ వివాదాస్పద భూమి తీవ్ర ఉత్కంఠతకు గురిచేసింది. వివాదాస్పద భూమి తమదే అంటు ఓ వర్గం. కాదు కబ్జాలోకి వచ్చారని మరో వర్గం ఆరోపించడంతో వివాదం కలకలం రేపింది. చివరకు పంచాయతీ డీఎస్పీ కార్యాలయం వరకు చేరింది. ఇరు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అసలేం జరిగిందంటే… హైదరాబాద్ రోడ్డు మార్గంలోని సర్వే నెంబర్ 51, సర్వేనెంబర్ 5లలో రెహమాన్ అనే వ్యక్తికి కొంత భూమి ఉండేది. సర్వేనెంబర్ 51లోని సుమారు 12 ఎకరాల 13 గుంటల భూమిని అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి జీపీఏ హోల్డర్ గా ఉన్నారు.

ఈ సర్వేనెంబర్ లోని 13 గుంటల భూమి మద్య వివాదం కొనసాగుతోంది. అదేవిధంగా సర్వేనెంబర్ 5లో దాదాసు 760 గజాల భూమిని కొనుగోలు చేశారు. ఈ రెండు సర్వేనెంబర్ లు పక్కపక్కనే ఉండడంతో ఇద్దరి మద్య వివాదం ఏర్పడింది. గతంలో అబ్దుల్ రజాక్, కట్కం వీరేందర్ లు ఒకే పార్టీలో బీఆర్ఎస్ లో ఉన్నారు. ప్రస్తుతం రజాక్ బీఆర్ఎస్ పార్టీలో ఉండడంతో కట్కం వీరేందర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు.

అసలు వివాదం ఇదే…
సర్వే నెంబర్ 51లో మిగిలిపోయిన 13 గుంటల భూమిలో కట్కం వీరేందర్ సంబంధికులు వచ్చారని అబ్దుల్ రజాక్ వర్గం సభ్యులు చెబుతున్నారు. గతంలో అబ్దుల్ రజాక్ కట్కం వీరేందర్ పై తాజాగా బుధవారం 150 మందితో వివాదాస్పద భూమిలో చొరబడ్డారని ఆరోపించారు. మరోవైపు కట్కం వీరేందర్ మాట్లాడుతూ 2015లో సర్వేనెంబర్ 5లో సుమారు 760 గజాల భూమిని తాను, తన సోదరుడు కలిసి కొనుగోలు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.

గతంలో భూమి రెహమాన్ పేరుమీద ఉన్నప్పటికి లింకు డాక్యుమెంట్ల మీద భూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయకపోవడంతో ప్రత్యర్థులు వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై కోర్టు వెళితే.. జూన్ లోనే తమకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందన్నారు. తమ భూమిపై ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని తెలిపారు.

సంచనల వాఖ్యలు
మరోవైపు ఈ భూమి వివాదంపై మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ సంచలన వాఖ్యలు చేశారు. ఓ బడా నేత సోదరుడు ఈ తతంగం నడిపిస్తున్నారని విమర్శించారు. మంది మార్బలంతో భూమిని లాక్కునే విధంగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని. చట్టం తన పని తాను చె స్తుందని అన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు పురోగతికి స్కెచ్..!