తప్పుడు వార్తలు నమ్మొద్దు
– విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఒమిక్రాన్ నేపథ్యంలో పాఠశాలలకు సెలవంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మరాదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోషల్ మీడియాతో జరుగుతున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మొద్దని ఖండించారు. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కరోనాను కట్టడి చేద్దాం అంటూ మంత్రి పిలుపునిచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. అదే సమయంలో విద్యా సంస్థల యాజమాన్యాలు సైతం ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అన్ని విధాలా కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
