స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాల పరిశుభ్రతలో భాగంగా స్వచ్ఛతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని తాండూరు మున్సిపల్ అధికారులు సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా మంగళవారం తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తడిచెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులను తాండూరు మండలం అంతారం గుట్ట సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డుకు తీసుకవచ్చారు. మున్సిపల్ నుంచి సేకరించిన తడిచెత్త, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని వివరించారు. దీంతో పాటు తడిచెత్త, పొడిచెత్తతో ఎరువులను తయారు చేయడాన్ని చూపించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతతో పాటు స్వచ్ఛతపై అవగాహన పెంచుకోవాలన్నారు. తడిచెత్త, పొడి చెత్త వేరు చేసి రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణానికి జరిగే మేలును ఇతరులకు వివరించాలన్నారు. కావున విద్యార్థులు తమ తమ ఇండ్లలో తడిచెత్త, పొడి చెత్త వేరు చేయడంపై చైతన్య పరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు, శానిటరి ఇను స్పెక్టర్ శ్యాంసుందర్, ఎన్విరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


