మేక పాలలో పోషక గుణాలు..!
– డెంగ్యూ నియంత్రణలో కీలకం
– రక్తపోటుకు బెస్ట్ మెడిసిన్
దర్శిని ప్రతినిధి : ఇటీవల కాలంలో వేల మంది డెంగ్యూ బారినపడుతున్నారు. దీని నుంచి త్వరగా బయటపడాలంటే.. సరైన ఆహారం కీలకమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే, డెంగ్యూ బాధితులకు మేకపాలు మేలు చేస్తాయనే వార్తలు కూడా ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిపుణుల ప్రకారం.. మేక పాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పాలు మాదిరిగానే మేక పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పోషకగుణాలు అధికంగా ఉండే ఈ పాలను తాగడం వల్ల పలు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చునని చెబుతున్నారు.
ఒక కప్పు మేక పాలు తీసుకోవడం వల్ల 30 శాతం ఫాటీ ఆమ్లాలను శరీరం అధికంగా పొందుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మేక పాలలో ఉండే బయోఆర్గానికి సోడియం శరీరానికి చాలా మేలు చేస్తుంది. కణాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మేక పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ప్రతిరోజు మేకపాలు తాగడం వల్ల రక్తపోటు నియంత్రిస్తుంది. మేక పాలను తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
డెంగ్యూ సోకిన వారికి రక్తంలో ప్లేట్ లేట్స్ తగ్గిపోతుంటాయి. వారికి మేక పాలు ఇస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. కానీ, డెంగ్యూ చికిత్సతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక పోషకమైన ఎంపిక, శరీరానికి అవసరమైన పోషణను అందించగలదని నిపుణులు అంటున్నారు, అయితే ఇది ప్లేట్లెట్లను పెంచడంలో లేదా డెంగ్యూ వైరస్ ప్రభావాన్ని నేరుగా నియంత్రించడంలో సహాయపడదు.
ప్రొటీన్స్, కాల్షియం ఎక్కువగా ఉండే మేక పాలను తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. మేక పాలల్లో అమినోయాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని సక్రమంగా అందుతాయి. ఇది ఆవు పాల కంటే ఎక్కువ ప్రోటీన్, అవసరమైన విటమిన్లు, తక్కువ లాక్టోస్ కలిగి ఉంటుంది, దీని కారణంగా ఇది సులభంగా జీర్ణమవుతుంది.
ఇదికూడా చదవడి…

