శభాష్ ఉమాదేవి..!
– ఇన్ప్సిరేషన్ అవార్డు అభినందనీయం
– సన్మానించిన తాండూరు హిందూ ఉత్సవ సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ రాజధాని ఢిల్లీలో గ్లోబల్ ఇన్ప్సిరేషన్ అవార్డును తీసుకున్న తాండూరు చెందిన ఉమాదేవిని శభాష్ అంటూ హిందూ ఉత్సవ సమితి అభినందించింది. తాండూరుకు చెందిన ఉమాదేవి జ్యూటీఫై పేరుతో వ్యాపార సంస్థను నిర్వహిస్తూ ఇందులో పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే జ్యూట్ బ్యాగులను తయారు చేస్తున్నారు. ఇందుకు గాను ఢిల్లీలోని గ్లోబల్ వుమెన్(జీడబ్ల్యూఐఏ) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాప్ 100 ఇన్ప్సిరేషన్ అవార్డుల ప్రధానోత్సవానికి ఉమాదేవి ఎంపికైంది.
ఇటీవలే జీడబ్ల్యూఐఏ సంస్థ ద్వారా తాండూరుకు చెందిన ఉమాదేవికి ఇన్స్పిరేషన్ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలుల ఆధ్వర్యంలో సమితి సభ్యులు ఉమాదేవిని కలిసి సన్మానించారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ జ్యాట్ బ్యాగుల తయారితో పాటు ఉపాధి రంగంలో రాణిస్తూ గ్లోబల్ ఇన్ప్సిరేషన్ అవార్డును పొందడం అభినందనీయమని కొనియాడారు. ఆమె కృషి ఎందరికో గర్వకారణమని.. శభాష్ అంటూ అభినందించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు కౌన్సిలర్ రాము, పర్యాద రామకృష్ణ, పరమేష్, అంతారం కిరణ్, దావులయ్య, రజక నర్సింహా, సందీప్ రెడ్డి, కోట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

