హలో.. నేను కమీషనర్‌ను..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

హలో.. నేను కమీషనర్‌ను..!
– ట్యాక్స్ డబ్బులు వేస్తావాల లేదా
– తాండూరులో ఓ యజమానికి ఫేక్ కాల్‌
– చివరికి ఏం జరిగిందంటే…?
తాండూరు, దర్శిని ప్రతినిధి : హలో.. నేను మున్సిపల్ కమీషనర్‌ను.. మీ దుకాణంకు సంబంధించిన ట్రేడ్ ట్యాక్స్ పెండింగ్ ఉంది.. వెంటనే డబ్బులు వేయాలని ఓ యజమానికి కేటుగాటు గాలం వేశాడు. అంతటితో ఆగకుండా మా సిబ్బంది వచ్చి సామాగ్రిని సీజ్ చేస్తారని హెచ్చరించాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తాండూరు పట్టణానికి చెందిన మనోహర్‌ అనే వ్యక్తి పట్టణంలో ఫ్లైవుడ్ షాప్‌ నిర్వహిస్తున్నారు. అయితే యజమాని మనోహర్‌కు 9032088447 అనే నెంబర్‌తో ఓ గుర్తుతెలియని కేటుగాడు ఫోన్ చేసి.. మున్సిపల్‌ కమీషనర్‌కు పరిచయం చేసుకున్నాడు.

దుకాణంకు సంబంధించిన ట్రేడ్ ట్యాక్స్ రూ. 19వేలు పెండింగ్‌లో ఉందని, వెంటనే ఈ ఓనెంబర్‌కు ఫోన్‌ పే ద్వారా డబ్బులు చెల్లించాలని దబాయించాడు. లేదంటే మా సిబ్బంది వచ్చి మా షాపులోని సామాగ్రిని సీజ్ చేస్తామని హెచ్చరించాడు. నిజానికి గత యేడాదే మనోహర్ తన దుకాణం ట్రేడ్ ట్యాక్స్‌ రూ. 1880లు చెల్లించాడు. తాను ఎలాంటి బకాయి లేనని ధైర్యంతో మున్సిపల్ అధికారులకు ఫోన్ చేశారు. డబ్బులు చెల్లించినా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని అధికారులను ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసింది.

ఈ ఫోన్‌ చేసింది గుర్తుతెలియని వ్యక్తి అని. అలాంటి నెంబర్‌లో ఎవ్వరు లేరని, ఎవరో ఫేక్ కాల్ చేశారని తేలడంతో మనోహర్ షాక్‌కు గురయ్యాడు. అనుమానం లేకుండా అడిగిన వెంటనే డబ్బులు వేసి ఉంటే నష్టపోయే వాడినని ఊరట చెందాడు. ఈ సంఘటనతో ఇలాంటి ఫేక్‌ కాల్‌ల నుంచి అలెర్ట్‌గా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచనలు గుర్తుకొచ్చాయి.

ఇదికూడా చదవండి…

జిల్లాలో కొత్త పోలీస్టేషన్లు..!