చిలుక వాగు సర్వేలో మలుపులు..!
– ప్రవాహ స్థితిని గుర్తించిన అధికారులు
– ఆందోళన వ్యక్తం చేస్తున్న భూ బాధితులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే ఆదేశాలలో చేపట్టిన చిలుక ప్రక్షాళన రోజుకో మలుపు తిరుగుతోంది. హైదరాబాద్ రోడ్డు మార్గంలో నాలుగు రోజుల క్రితం చిలుకవాగులో పూడిక పనులు చేపట్టారు. అప్పట్లో బీజేపీ నేతలు చిలుక వాగును పాత కాలువ పద్ధతిలోనే తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్అండ్ బి శాఖల అధికారులు సర్వే నిర్వహించారు.
సోమవారం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు సర్వేను చేపట్టారు. ఈ సర్వేలో చిలుక వాగు హైదరాబాద్ రోడ్డు మార్గం మొదలు కొని కోకట్ శివారులో ముగిసి కాగ్నా నదిలో కలుస్తుందని నిర్ధారించారు. గ్రామ నక్ష ఆధారంగా సర్వేనెంబర్ 36, 39, 41, 47, 48, 49, 52, 53, 57, 58, 59, 62, 63లలో ప్రవాహ మార్గం ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.
ఈ సర్వేలో ఇరిగేషన్ డీఈ కిష్టయ్య, ఆర్ఐ నారాయణ రెడ్డి, సర్వేయర్ మహేష్, మున్సిపల్ శానిటరీ ఇనుస్పెక్టర్ ఉమేష్ కుమార్. పాల్గొన్నారు. ఈ నివేధికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. మరోవైపు చిలుక వాగులో గత కొన్నేళ్ల నుంచి రోడ్లు, మురుగు కాలువలు, భవన నిర్మాణాలు, ఖాళీ పాట్లు వెలిశాయి. ప్రస్తుతం అధికారులు చిలుక వాగు సర్వే చేపట్టడంతో పలువురు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
చిలుక వాగు ప్రవాహ మార్గంలో తమకు చెందిన పాట్లు, నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు. దీంట్లో చిలుక వాగు మార్గం లేదని తమకు అమ్మకాలు చేపట్టారని తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
ఇదికూడా చదవండి…

