బీట్‌ రూట్‌తో.. హెల్త్ గ్రేట్..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

బీట్‌ రూట్‌తో.. హెల్త్ గ్రేట్..!
– తిన్నా, జ్యూస్ తాగినా ప్రయోజనాలు
– చర్మం, వృద్ధాప్య లక్షణాలు తగ్గింపులో సాయం
దర్శిని డెస్క్ : బీట్‌రూట్‌తో ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్ తిన్నా.. జ్యూస్ చేసుకుని తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తాయని అంటున్నారు. బీట్‌రూట్ ఆకులలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాకుండా బీట్‌రూట్ ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బీట్‌రూట్ ఆకుల రుచి తీపిగా ఉంటుంది.. కాబట్టి జ్యూస్‌ చేసుకుని తాగవచ్చు. బీట్‌రూట్‌ ఆకులను కర్రీగా కూడా చేసుకోవచ్చు.

బీట్‌రూట్ ఆకులతో పకోడా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడటంలో ఈ ఆకులు సహాయపడతాయి. బీట్‌రూట్ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుండి చర్మాన్ని కాపాడతాయి. చర్మానికి తేమను అందించడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.

అంతే కాకుండా.. ఇది వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బీట్‌రూట్ ఆకులలో యాంటీఆక్సిడెంట్‌లతో పాటు అవసరమైన విటమిన్లు కూడా లభిస్తాయి. ఈ పోషకాలు కొల్లాజెన్‌ను పెంచడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బీట్‌రూట్ ఆకులలో నైట్రస్ ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్, ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా.. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇదికూడా చదవండి…

దశలవారిగా రోడ్ల అభివృద్ది..!