వ్యాపారులకు సూపర్ ఆఫర్..!
– రాత్రంతా దుకాణాలు నడిపించుకునే అవకాశం
– ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని వ్యాపారులకు సర్కారు సూపర్ ఆఫర్ ఇచ్చింది. రాత్రి పూట కూడా దుకాణాలు నిర్వహించేందకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉత్తర్వులు కూడా జారీ చేయడం విశేషం.

ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం మొదలైపోయింది. ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాసాలతో భక్తి ప్రవృత్తుల నడుమ రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వ్యాపారస్తులు రాత్రంతా తమ వ్యాపారాలను నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. అత్యంత పవిత్రమైన రంజాన్ మాసాన్ని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మరింత ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రంజాన్ పవిత్రమైన మాసం కావడంతో రాత్రంతా వ్యాపారాలు చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వ సానుకూల నిర్ణయం పట్ల వ్యాపారస్తులు, ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ నిర్ణయం మేరకు పోలీసులు ముస్లింలకు, బడా వ్యాపారస్తులకు పలు సూచనలు నిబంధనలు సూచించారు. రాత్రి పూట ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.


