ఫోన్ వస్తే ఎత్తకండి..!
– ఆ నెంబర్లతో ప్రమాదం
– హెచ్చరించిన సైబర్ క్రైమ్ పోలీసులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : పరిచయం లేని వ్యక్తులు చేసే ఫోన్ చేశారని ఎత్తినా, ఎవరో మిస్ కాల్ ఇచ్చారని తిరిగి చేసినా గుల్లై పోతారు జాగ్రత్త అని అంటున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ మేరకు వారు ఒక ప్రకటనలో సైబర్ నేరాలకు అస్కారం ఉన్న ఫోన్ నెంబర్ల వివరాలను విడుదల చేశారు. +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబరుతో ఫోన్ వస్తే ఎత్తరాదన్నారు. ప్రధానంగా +371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి కోడ్‌లతో మొదలయ్యే నంబరుతో రింగ్ చేసి ఎత్తిన తర్వాత హ్యాంగ్ చేస్తారన్నారు. తిరిగి ఫోన్ చేస్తే కాంటాక్ట్ జాబితాతోపాటు బ్యాంకు, క్రెడిట్ కార్డు ఇతర వివరాలు మూడు సెకన్లలో కాపీచేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా #90 లేదా #09 నంబర్లను నొక్కాలని ఎవరైనా సూచిస్తే ఆ ప్రయత్నం చేయొద్దన్నారు. అలా చేస్తే మీ సిమ్ కార్డుని యాక్సెస్ చేయడానికి, మీ ఖర్చుతో కాల్ చేయడానికి, మిమ్మల్ని నేరస్థుడిగా చేయడానికి కుట్రపన్నుతున్నట్లుగా గుర్తించాలని తెలిపారు.
ఇదికూడా చదవండి…

