మలబద్దకంపై చూ..మంత్రం..!
– త్రిఫల చూర్ణంతో సమస్య పరార్
– ప్రేగు ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగు
దర్శిని డెస్క్ : మనిషీ శరీరంలో ప్రేగు కదలికలు మందగించడం వల్ల మలబద్దక సమస్య ఏర్పడుతుంది. దీనికి తోడు నీరు తక్కువగా తాగడం, ఫైబర్ లేని ఆహారం తీసుకోవడం వల్ల సమస్య అధికమై ఇబ్బందులు పడుతుంటూరు. కాబట్టి మలబద్ధకాన్ని అస్సలు తేలికగా తీసుకోకూడదు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు. మలబద్దక సమస్యపై త్రిఫల చూర్ణం చూ మంత్రంలా పనిచేస్తుందని ఆయుర్వేధ నిపుణులు చెబుతున్నారు. ఉసిరి, కరక్కాయ, తానికాయలు.. ఈ మూడు పండ్లను ఎండబెట్టి పొడి చేసి త్రిఫలా తయారు చేస్తారు. ఈ హెర్బల్ పదార్ధం పొట్టను శుభ్రపరచడంలో బలేగా పనిచేస్తుంది.
త్రిఫల నానబెట్టిన నీటిని తాగడం వల్ల ఉదయాన్నే పొట్ట క్లియర్ అవుతుంది. ఈ పానీయం శరీరంలోని అన్ని కాలుష్య కారకాలను బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది. త్రిఫల నీరు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఓ చెంచా త్రిఫల పొడిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో తాగాలి. రుచి కోసం అందులో 1 స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు.
ఎలా పనిచేస్తుందంటే…
త్రిఫల నీరు పేగు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం నుంచి ఉపశమనానికి కూడా ఇది సహాయపడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడమేకాకుండా, జీవక్రియ రేటును పెంచడంలో కూడా త్రిఫల సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది. దీంతో బరువును కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి త్రిఫల నీటిని సేవించవచ్చు.
ఇదికూడా చదవండి…

