జామా జ్యూస్‌లో ఆరోగ్య రహస్యాలు..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

జామా జ్యూస్‌లో ఆరోగ్య రహస్యాలు..!
– ఇందులో ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు
– కంటికి, గుండె వ్యాధులను దూరం చేసే ఔషదాలు
దర్శిని డెస్క్ : మార్కెట్లో ఉండే పండ్లలో అన్నింటికంటే చౌకైనది. జామకాయ అంటే పిల్లల నుండి పెద్దల వరకూ ప్రతి ఒక్కరీకి ఇష్టమైన పండు. తీపి, వగరు, పులుపు మూడు రుచుల మేలైన కలయిక జామకాయ. పేదల పాలిటి ప్రియ నేస్తం జామకాయ. జామ పండుతో పాటు జ్యూస్‌తో కూడా మన ఆరోగ్యానికి అనేక ప్రయోజాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

జామకాయ, జామపండు రెండింటిలోనూ మినిరల్స్, విటమిన్స్, ఇతర పోషకాంశాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి లు ఉండటం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చును. ఈ పండులోని యాంటీ ఆక్సిడెట్స్, ఒమేగా -3, 6, ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి. వాస్తవంగా చెప్పాలంటే వీటిలో ఉండే న్యూట్రీషియన్ గుణాలు ఇతర ఫ్రూట్స్ లో కంటే వీటిలో ఎక్కువ. జామ కాయలోలాగే, జామకాయతో చేసే జ్యూస్ లో కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.

జామ కాయ జ్యూస్ లో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో అన్ని రకాల వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ను పెంచుతుంది. . ప్యాథోజెన్స్ నుండి శరీరంను కాపాడుతుంది.

రెగ్యులర్ గా గోవ జ్యూస్ (జామకాయ జ్యూస్)తాగడం వల్ల డయాబెటిస్ నుండి రక్షణ కల్పిస్తుంది. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఈ జామకాయలో గ్లిజమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా నివారిస్తుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల గ్లూకోజ్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జామ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. వయస్సు రిత్యా వచ్చే కళ్ళ సంబంధిత సమస్యలు, వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జామ జ్యూస్ లో ఉండే విటమిన్ ఎ అందకు గ్రేట్ గా సహాయపడుతుంది.

డైటరీ ఫైబర్ ఎక్కువగా లభించే ఈ పండుని తినటం వల్ల మలబద్దకం సమస్య దూరమవుతుంది. ఒక జామ పండుని తింటే రోజుకు అవసరమైన 12 శాతం పీచు శరీరానికి అందుతుంది. ఫలితంగా జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. ఎక్కువ పీచు, సోడియం పొటాషియం నిల్వలను సమన్వయ పరిచి రక్త పోటును అదుపులో ఉంచుతాయి. ఇందులోని పోషకాలు ట్రైగ్లి రాయిడ్స్ చేడు కొవ్వును తగ్గించటంలో కీలకంగా పనిచేస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

జామలోని మెగ్నీషియం.. మనం తీసుకునే ఆహార పదార్ధాలలోని పోషకాలను సరిగా స్వీకరించటానికి సహకరిస్తుంది. యాంటీ యాక్సిడెంట్స్ ప్రీరాడికల్స్‌ను బయటకు పంపడంలో కీలకంగా పనిచేస్తాయి. ఇంకా వీటినిలోని ఔషధగుణాలు కాన్సర్ కణాల వృద్దిని అడ్డుకుంటాయి.

జామ వివిధ రకాల విటమిన్లు మరియు అనామ్లజనకాలుతో నిండి ఉంటుంది, కాబట్టి జామపండును తినడంవల్ల చర్మానికి అద్భుతాలే చేయగలదు. జామపండులో అనామ్లజనకాలు అధిక స్థాయిలో ఉన్నందున వృద్ధాప్య ప్రక్రియను తగ్గించడం మరియు చర్మం ముడుతల్ని తగ్గించడంతో సహా అనేక ఇతర చర్మ సమస్యలకు ఇది దోహదపడుతుంది. మోటిమల చికిత్సకు కూడా జామ సారాలు సహాయపడతాయి.

ఇదికూడా చదవండి…

వయా తాండూరు టు బీదర్..!