సంబరంగా.. సంతోషంగా.. రాజ్ కుమార్ జన్మదినం

తాండూరు రాజకీయం వికారాబాద్

సంబరంగా.. సంతోషంగా.. రాజ్ కుమార్ జన్మదినం
– స్ఫూర్తిని నింపిన సేవా కార్యక్రమాలు
– ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన
– శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, బీసీల నాయకుడు కందుకూరి రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు సంబరంగా.. సంతోషంగా జరుపుకున్నారు. సోమవారం రాజ్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని ఉచిత కంటి వైద్య శిబిరం, సేవా కార్యక్రమాలు చేశారు. ఎంపీటీ హాల్లో లో రాజ్ కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి సహాకారంతో కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి దాదాపు 300ల మంది శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. దీంతో శిబిరానికి స్పందన లభిచింది.

అదేవిధంగా ముదిరాజ్ సంఘం యువనాయకులు రాము ముదిరాజ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అల్పాహారం పంపిణీ చేశారు. టైలర్ రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని మల్ రెడ్డిపల్లి, ఇందిరానగర్ లోని అంగన్ వాడి కేంద్రాలలో చిన్నారులకు టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. బషీరాబాద్ మండలంలో బీసీ సంఘం మండల అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మండలంలని రెడ్డిఘనాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు, స్కేల్ లు పంపిణీ చేశారు.

మరోవైపు జన్మదినం జరుపుకున్న కందుకూరి రాజ్ కుమార్ కు పలువురు, ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్. బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మండలాల అధ్యక్షులు లక్ష్మణ్ చారి, నరేందర్, బసంత్ కుమార్, శ్రావణ్ కుమార్, వ్యాపార వేత్తలు కోహీర్ రాజు, నితిన్ సోమాని, రవిరాజ్, గ్లోబర్ యువతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయేందర్. అరుణ్ రాజ్, నాయకులు బంటు మల్లప్ప, హన్మంతు ముదిరాజ్. బీసీ మహిళ నాయకులు జ్యోతి, అనిత, మంజుల, నర్సమ్మ, రాజ్, హరిచల్లా, కోటం సిద్దంలింగం, బీసీ సంఘం నాయకులు బసవరాజ్, రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, టైలర్ రమేష్. తాండ్ర నరేష్, మంతటి రాజు, శివకుమార్, పరమేష్, గిరిజాపూర్ రమేష్, పండు గౌడ్, దుబాయి వెంకట్, హరిప్రసాద్, అనిల్, అమ్రేష్, నరహరి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతకూ అందరి సహాకారంతో బీసీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

ఇదికూడా చదవండి…

రెవెన్యూ శాఖలో వెయ్యి ఉద్యోగాలు..!